07-05-2025 10:27:40 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సాయి హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షులు సంగమేశ్వర్ గుప్త జన్మదిన సందర్భంగా బుధవారం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సంగమేశ్వర్ మిత్రులు మాట్లాడుతూ... బర్తే సందర్భంగా రక్తదానం, పేదలకు భోజనం పొట్లాలను పంపిణీ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.