07-05-2025 10:17:03 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని, కర్రెగుట్ట చుట్టూ మోహరించిన కేంద్ర బలగాలు వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కొత్తగూడ మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీపార్టీ) అధ్యక్షతన తుడుందెబ్బ, సంక్షేమ పరిషత్, సిపిఐ ఎంఎల్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.