7 May, 2026 | 3:15 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు

26-07-2025 09:01 PM

కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన  సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులుకు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్ వరించింది. కాగా ఈరోజు శనివారం హైదరాబాదులో జరిగిన త్యాగరాయ గాన సభ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి, విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

గతంలో సూక్ష్మ కళారూపాలు 501 బియ్యపు గింజలపై ఎనిమిది భాషల జాతీయ గీతం రాయడం జరిగిందని 13 మిల్లిలా చెస్ బోర్డు విత్ కాయిన్స్ వంటి ఎన్నో కళారూపాలు తాను తయారు చేసినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తమలపాకుల సైదులకు అవార్డు రావడం పట్ల పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.