26-07-2025 09:03:50 PM
కోరుట్ల,(విజయక్రాంతి): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద కార్గిల్ అమరవీరులకు కొవ్వతులతో నివాళులర్పించిన కోరుట్ల బిజెపి నాయకులు. 1999లో భారత వాస్తవాధీన రేఖలు దాటి ప్రదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని 80 రోజుల పాటు వీరోచితంగా పోరాడి జులై 26న ఆపరేషన్ విజయ్ ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సైన్యం. ఈ యుద్ధంలో ప్రాణాలర్పించిన 527 మంది వీర సైనికుల ధైర్య, సాహసాలను త్యాగాన్ని గుర్తు చేసుకుని నివాళులర్పించిన బిజెపి నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నరేష్, గణేష్, జిల్లా నాయకులు మహేష్, సాగర్, రాచమడుగు శ్రీనివాస్ రావు, గిన్నెల శ్రీకాంత్, బ్రహ్మం, ఉదయ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు