26-07-2025 08:59:31 PM
శ్రీరంగాపూర్: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న తోకల సురేష్ శనివారం ఉదయం కరెంటు షాక్ తో మరణించడంతో టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు,పెబ్బేరు ప్రెస్ క్లబ్, శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన భౌతిక గాయానికి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొని వీడ్కోలు పలికారు.ఆ కుటుంబానికి మనోధైర్యం ఇస్తూ వారికి చేయూతగా ఉండేందుకు రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.