calender_icon.png 9 December, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూనవరంలో సకిని అశ్విని విస్తృత ప్రచారం

09-12-2025 12:25:57 AM

గెలుపు ఖాయం అంటున్న సర్పంచ్ అభ్యర్థి అశ్విని

మణుగూరు, డిసెంబర్ 8 (విజయక్రాంతి)మండల పరిధిలోని కూనవరం గ్రామ పంచాయతీలో సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి సకిని అశ్విని పంచాయతీలో సోమవారం విస్తృత ప్రచా రం నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్, చంద్రబాబు నగర్, రేగులగండి ఏరియాలలో సిపి ఎం, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ..బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

అనంతరం అశ్విని మాట్లాడుతూ, కూనవరం పంచాయతీలో తన మామ పద్మశ్రీ సకిని రామచం ద్రయ్యకు ఉన్న మంచి పేరుకు తోడు గత బీఆర్‌ఎస్ పాలన సంక్షేమ పథకాలు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చరిష్మాతో పా టు, ప్రచారంలో తనకు ప్రజలనుండి లభిస్తున్న ఆదరణతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపుతో పంచాయతీనీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని పేర్కొన్నారు.