09-12-2025 12:25:43 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు కలగకూడదని అన్నారు. ఆన్లైన్ మాధ్యమం ద్వారా సమావేశంలో పాల్గొన్న తహసిల్దారులు, ఎంపీడీవోలకు మరొకసారి ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల సిబ్బంది, సామాగ్రి తరలింపునకు సరిపడినన్ని వాహనాలు సిద్ధం గా ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డిపిఓ శ్రీనివాస్, డీఈవో భోజన్న, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.