calender_icon.png 6 May, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాదాబైనామాలకు మోక్షం..!

06-05-2025 12:00:00 AM

  1. పట్టాలు రాక నానా అవస్థలు

ఐదేళ్ళుగా రైతుల ప్రదక్షిణలు

భూ భారతిపై ఆశలు

సంగారెడ్డి, మే 5(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్ట్ప రైతులు ఆశలు పె ట్టుకున్నారు. ఈ పోర్టల్లో సాదాబైనామాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ళ క్రితం సాదాబైనామా కింద భూముల మార్పిడి కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు వేలాది దరఖాస్తులు ఇచ్చారు. నాటినుంచి వీటికి అతీగ తి లేకుండా పోయింది.

కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టాలు చేతికి రావడం లేదు. ఈ నేపథ్యంలో భూ భారతి పోర్టల్లో సాదాబైనామాల క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వడంతో సంగారెడ్డి, మె దక్ జిల్లాల్లో సుమారు 40వేల దరఖాస్తులు పెండింగ్ దరఖాస్తుదారులకు మోక్షం కలగనుంది. 

సాదాబైనామాకు అవకాశం ఇవ్వడంతో...

2014 జూన్ 2 నాటికి ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్న వా రికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీనికి సంబంధించి 20 20 నవంబర్ 10 వరకు జిల్లా వ్యాప్తంగా దా దాపు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సుమారు 40వేల దరఖాస్తులు వచ్చాయి.

ఈ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉండగా సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టారు. పాత చట్టం ప్రకారం సాదాబైనామాకు దరకాస్తులు స్వీకరించగా కొత్తచట్టం అమలులోకి రావడంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి. 

ఆర్డీవోలకు బాధ్యతలు...

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్లో సాదాబైనామా క్రమబద్దీకరణకు అవకాశం కల్పించా రు. ఈ చట్టంలోనే ఈ సాదాబైనామా దరఖాస్తులపై 90 రోజుల్లోపు విచారణ చేప ట్టాలని, ఈ బాధ్యతలను సైతం ఆర్డీవోలకు అప్పగించారు. విచారణ చేపట్టి దరఖాస్తుదారులకు హక్కులు కల్పించాలని చట్టంలో పేర్కొనడంతో వారికి ఊరట కలగనుంది.