calender_icon.png 6 May, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెత్త కంపు కొడుతున్న ముంపు గ్రామాలు

06-05-2025 12:00:00 AM

  1. ఐదు నెలలుగా పత్తాలేని పంచాయతీ కార్మికుల జీతాలు
  2. చేతులెత్తేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్, తొగుట మండల అధికారులు 
  3. అయోమయంలో పంచాయతీ కార్మికులు
  4. ఐదు రోజులుగా చెత్త సేకరణ బంద్
  5. గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో గ్రామాల దుస్థితి

గజ్వేల్, మే 5 :  గత ఐదు రోజులుగా గజ్వేల్ పరిధిలోని మల్లన్న సాగర్ ఆర్‌ఎన్‌ఆర్ కాలనీ గ్రామాలు చెత్త కంపు కొడుతు న్నాయి. మల్లన్న సాగర్ లో తొగుట తొగుట మండలానికి చెందిన 10 గ్రామాలు ముంపు కు గురి కావడంతో  తొగుట మండలం నుం డి ఆ గ్రామాలను అధికారికంగా తొలగించారు. అయితే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రెవెన్యూ పరిధిలోని ముట్రాజ్ పల్లి సంగాపూర్ గ్రా మాలను కలిపి ఉన్న ఆర్ అండ్ ఆర్ కాలనీ లో ముంపు గ్రామాల ప్రజలకు పునరావా సం కల్పించినా అధికారికంగా ఆయా గ్రామాలు ఎలాంటి సేవలు పొందలేకపోతున్నాయి.

ఐదు నెలలుగా పంచాయతీ కార్మి కుల జీతాలు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓపిక నశించిన పంచాయతీ కార్మికులు గత ఐదు రోజులుగా చెత్త సేకరణను  నిలిపివేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలోని అన్ని ముంపు గ్రామాల పంచాయతీ  పారిశుధ్య కార్మికులు ఒక తాటి పైకి వచ్చి తమ జీతాలు చెల్లించే వరకు పారిశుద్ధ్య పనులు చేయమని భీష్మించుకు  కూర్చు న్నారు. 

దీంతో ఐదు రోజులుగా గ్రామాలలో,  నివాస పరిసరాలలో  చెత్త సేకరణ నిలిచిపోయింది. తడి పొడి చెత్తలు కుళ్ళిపోయి ఊరంతా చె త్త కంపు కొడుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముం పు గ్రామాలలో పనిచేసే గ్రామపంచాయతీ కార్మికుల  సమస్యలను అటు తొగుట మం డలం అధికారులకు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులకు తెలియజేసినా వారిని చేయలేమని చేతులెత్తేశారు.

పునరావాస గ్రామాలలో  ప్రజల నివాసం ప్రారం భం నాటి నుండి  పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నేరుగా వేతనాలు చెల్లించడం జరుగుతుంది. గత నవంబర్ వరకు వేతనాలు చెల్లించగా , డిసెంబర్ నుం డి వేతనాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోయారు.

తమ సమస్యను ఎలా పరిష్కరించు కోవాలో తెలియక  పంచాయతీ కార్మికులు పారిశుధ్య పనులను నిలిపివేశారు. ప్రభు త్వం వెంటనే తమకు జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో విధులు నిర్వహించబోమని చెబుతున్నారు.

వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలి -

మాకు ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్రమైన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చేతిలో చిల్లి గవ్వలేదు.  ఐదు నెలలుగా పడుతున్న మా బాధలు ఎవరికి పట్టడం లేదు. అందుకే పనులను మానేశాం. మాకు జీతాలు చెల్లిస్తే గాని పనులు చేయడం.

 కొమ్ము స్వామి, పల్లె పహాడ్ గ్రామ పారిశుధ్య కార్మికుడు