26 May, 2026 | 4:27 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

అక్కినేని సినిమాకు సమంత బెస్ట్ విష్‌స్!

10-04-2026 01:28 AM

అక్కినేని ఫ్యామిలీ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది ఆ ఇంటి మాజీ కోడలు, స్టార్ హీరోయిన్ సమంత! అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నాయకానాయికలుగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డెకాయిట్ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు షానియల్ డియో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్‌రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు.

ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుందీ సినిమా. ఈ నేపథ్యంలోనే సమంత ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నిర్మాత సుప్రియ యార్లగడ్డను ఉద్దేశిస్తూ భావోద్వేగపూర్వకంగా పోస్ట్ పెట్టింది సమంత. “సుప్రియా.. నీ కృషి, పట్టుదల, సినిమాపై నీకున్న అంకితభావాన్ని నేను దగ్గరగా చూశాను.

బ్లాక్‌బస్టర్ విజయం కోసం నువ్వు అర్హురాలివి. దేవుడి ఆశీస్సులు నీకెప్పుడూ ఉండాలి. ‘డెకాయిట్’ టీమ్‌కు నా అభినందనలు” అంటూ సమంత తన ఇన్‌స్టోరీలో పేర్కొంది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ ప్రొఫెషనల్‌గా ఇలా స్పందించడం పట్ల నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.