30 ఏళ్లుగా అదే గోల
జమ్ముకశ్మీర్, ఆగస్టు 26: జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహం ఎప్పుడు చేసుకుంటారని రాహుల్‌ను పలువురు యువతులు ప్రశ్నించగా.. సమాధానమిస్తూ 20, 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించానని చెప్పారు. శ్రీనగర్‌కు చెందిన పలువురు విద్యార్థినులతో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవడంపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి ఏమైనా ఉందా అంటూ రాహుల్ ప్రశ్నించారు. అదే సమయంలో మీ పెళ్లి ఎప్పుడంటూ రాహుల్‌నే యువతులు ఎదురు ప్రశ్నించారు. దానికి నవ్వుతూ ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి గురించి తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కానీ వాటిని తోసిపుచ్చలేమని చెప్పారు. పెళ్లి చేసుకుంటే తమను కూడా పిలువాలని యువతులు కోరగా తప్పకుండా అని రాహుల్ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.




