29 June, 2026 | 12:21 PM

బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం

16-04-2026 01:32 AM

డిప్యూటీ సీఎంలుగా బిజేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్

పాట్నా, ఏప్రిల్ 15: బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. బుధవారం బీహార్ లోక్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అత హుస్సేన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మిత్రపక్షాల నాయకులు పాల్గొన్నారు.

ఈయనతో పాటు జేడీ(యూ)కు చెందిన బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌదరిలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభకు ఎన్నికైన జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. సామ్రాట్ చౌదరికి మాజీ సీఎం నితీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం సామ్రాట్ చౌదరి పార్టీ కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. ‘మనం బీహార్ అభివృద్ధి కోసం పనిచేయాలని, కార్యకర్తల మద్దతుతోనే పార్టీ ఏర్పడిందన్నారు.

ఇక బీహార్‌లో మోదీజ నమూనా మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ముందు సామ్రాట్ చౌదరి పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంగా ఎన్నికైన ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శక్తి, ప్రజాసేవపట్ల అంకితభావం, అట్టడుగుస్థాయి అనుభవం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, బీహార్ అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం పదవిని అధిష్ఠించిన సామ్రాట్ చౌదరిని పలువురు అభినందనల్లో ముంచెత్తారు.


FAQ's:


1. బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2. బీహార్‌లో డిప్యూటీ సీఎంలు ఎవరు?
జేడీయూ నేతలు బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మరియు విజయ్ కుమార్ చౌదరి డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు.

3. నితీష్ కుమార్ ఎందుకు రాజీనామా చేశారు?
నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

4. సామ్రాట్ చౌదరి ఏ పార్టీకి చెందినవారు?
సామ్రాట్ చౌదరి భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నాయకుడు.

5. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉంది?
బీజేపీ, జేడీయూ మరియు ఇతర మిత్రపక్షాల NDA కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది.

6. సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం ఎక్కడ జరిగింది?
పాట్నాలోని లోక్ భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది.

7. సామ్రాట్ చౌదరి సీఎం కావడం ఎందుకు ప్రత్యేకం?
బీజేపీ నుంచి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు.

8. ప్రధాని మోదీ ఏమన్నారు?
సామ్రాట్ చౌదరి నాయకత్వంలో బీహార్ అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

9.NDA అంటే ఏమిటి? 
NDA(National Democratic Alliance) అనేది బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.

10. బీహార్ రాజకీయాల్లో ఈ మార్పు ప్రభావం ఏమిటి?
ఈ మార్పుతో బీజేపీ ప్రభావం పెరగడం, రాష్ట్ర అభివృద్ధి దిశగా కొత్త నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది.