30 May, 2026 | 10:23 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్

05-04-2026 04:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసంపల్లి గ్రామంలో వరిగే లక్ష్మికి రెండు లక్షల 50 వేలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా అట్టి చెక్కును లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసినట్లు గ్రామ సర్పంచ్ పెద్దపట్లల్ల సునంద కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వరిగే లక్ష్మి మాట్లాడుతూ... సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపద సమయంలో అందజేయడం మరువలేనిదని, ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారబోయిన దుర్గవ్వ సాయిలు, మాజీ సర్పంచి అంజా గౌడ్, గ్రామస్తులు నరేందర్ రెడ్డి, శంకరయ్య, సామేలు,నర్సింలు, బిక్షపతి, సాయి కుమార్, బాలు, గంగయ్య, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.