30 May, 2026 | 9:51 PM

Breaking News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •   రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి   •   ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష   •   విత్తనాల కొనుగోలులో రశీదు తప్పనిసరి   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   రికార్డు స్థాయిలో పంట కొనుగోలు   •   బిఆర్ఎస్ కార్యకర్త రెండు కాళ్లు కోల్పోవడంతో పరామర్శించిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యేలు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి   •   రైతులకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్   •  

పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

05-04-2026 04:05 PM

డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య

ఏఐసీసీ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

తుంగతుర్తి (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కీర్తిశేషులు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు ఏఎసిసి నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కీర్తి శేషులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి,

ఆశయ సాధనలో భాగంగా నేడు సర్వోత్తమ్ రెడ్డి జిల్లాలో ప్రతి ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ... తనదైన శైలిలో పేద ప్రజలతో మమేకమై, సమస్యలను తెలుసుకుంటూ, ఎన్నికల్లో, ప్రత్యర్థుల నాయకులను మట్టికరిపిస్తూ, అత్యధిక స్థానాలు గెలుపొందుటలో సీనియర్ జూనియర్ నాయకులను ఏకం చేసి, గెలుపులో నాంది పలికారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనురాధ కిషన్ రావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరికొప్పుల నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, ముత్యాల వెంకన్న, వెంకటయ్య ,సుధాకర్ గౌడ్ పెదబోయిన అజయ్ కుమార్, కొండా రాజు, మాచర్ల అనిల్, తదితర నాయకులు పాల్గొన్నారు.