కల్వకుర్తి అభివృద్ధికి రూ.130 కోట్లు మంజూరు చేయండి
13-08-2026 01:36 AM
సీఎంకు ఎమ్మెల్యే కసిరెడ్డి వినతి
రంగారెడ్డి, ఆగస్టు 12 (విజయక్రాంతి): కల్వకుర్తి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అడుగులు వేస్తున్నా రు. దానిలో భాగంగానే బుధవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్లో నివాసంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లో పలు సమస్యలు, మౌలిక వసతుల కల్ప న, సంక్షేమ పథకాల అమలుపై పలు కీలక ప్రతిపాదనలను సీఎంకు సమర్పించారు. ని యోజకవర్గంలో ౨ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.80 కోట్లు ఇవ్వాలని,, ఆమనగల్లు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ.30 కోట్లు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు.






