పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
హెచ్‌ఎం దేసు సతీష్ కుమార్
గణపురం ఆగస్టు12 (విజయ క్రాంతి) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బాధ్యతగా మొక్కలు సంరక్షించినప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని గణపురం జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు దేసు సతీష్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ’వనమహోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పాఠశాల హెచ్‌ఎం దేసు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భరత్ కుమార్, కుమారస్వామి, శకీరా బేగం, రాంబాబు, రమేష్, శ్రీనివాస్, ముస్తాక్, దేవేందర్, దిల్షాద్, విద్యార్థులు పాల్గొన్నారు.






