12-06-2025 01:38:24 AM
నల్లగొండ టౌన్, జూన్ 11 : ఇకపై అన్ని రకాల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిజీ ఎం డి సి ) ద్వారానే సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు .ఇందుకుగాను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పనుల వారిగా సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు జాబితాలను సమర్పించాలని కోరారు.
బుధవారం ఆమె తన చాంబర్లో ఇందిరమ్మ ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భవిత కేంద్రాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు సరఫరా చేసే ఇసుక సరఫరా పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్న మొత్తం నుండి అధిక మొత్తంలో అవసరమయ్యే ఇసుకను ఇకపై టి జి ఎమ్ డి సి ద్వారా మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా మైనింగ్ అధికారి శామ్యూల్ జాకబ్, గృహ నిర్మాణ సంస్థ పిడి రాజ్ కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగార్జున, వై టి పి ఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుపతయ్య, ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.