12-06-2025 01:39:24 AM
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఈ నెల 14 లేదా 15న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి 29 వరకు నిర్వహించారు.