28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

తహసీల్దార్ ఎదుట ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల బైండోవర్

07-04-2026 01:11 AM

కేసముద్రం, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి వాగులో సోమవారం ఉదయం అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు నెల్లికుదూర్ ఎస్‌ఐ సిహెచ్. రమేష్ బాబు తన సిబ్బందితో బ్రాహ్మణ కొత్తపల్లి వాగు వద్దకు వెళ్ళగా అక్కడ ఖాళీ పది ట్రాక్టర్లు పట్టుబడ్డాయి.

అట్టి ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు యజమానులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఇకముందు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక గురించి వాగులోనికి  దిగకుండా, ఒకవేళ వాగులోనికి దిగి పట్టుబడితే రెండు లక్షల రూపాయల జరిమానా కట్టేటట్లు స్థానిక తహశీల్దార్ ముందు  బైండోవర్  చేసి, అట్టి ఖాళీ ట్రాక్టర్ ల యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించి, ఈ చలన్ ద్వారా జరిమానా విధించినట్లు ఎస్ ఐ తెలిపారు.  ప్రభుత్వ అదికారుల అనుమతి లేకుండా వాగుల నుండి అక్రమంగా ఇసుక రవాణా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.