మాజీ కార్పొరేటర్ల ఇళ్లల్లో పారిశుధ్య కార్మికులు
కరీంనగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం జనవరి 28తో ముగిసింది. అయితే కార్పొరేటర్లుగా ఉన్న సమయంలో వారి ఇళ్ల వద్ద పనిచేసిన పారిశుధ్య కార్మికులు ఇంకా కొనసాగుతున్నారు. తమ పదవీ కాలం ముగిసినా కొందరు కార్పొరేటర్లు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భావనతో వీరిచేత పనులు చేయించుకుంటు న్నారు.
చాలామంది కార్పొరేటర్లు తమ ఇండ్ల వద్ద వీరిని వినియోగించుకుంటు న్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా స్పందన లేకుండా పోయింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో వెయ్యి మంది వరకు పారిశుధ్య కార్మికులు ఉంటా రు. గతంలో 44 మంది జవాన్లు ఉండగా మరో 16 జవాన్ల సంఖ్యను పెంచారు. సాని టరీ ఇన్స్పెక్టర్లు ఏడుగురి వరకు ఉంటారు.
ఒక్కో సానిటరీ ఇన్స్పెక్టర్ పరిధి 8 నుంచి 12 డివిజన్ల వరకు ఉంటుంది. ఇటీవల పలువు రు కార్పొరేటర్ల వద్ద పనిచేసిన వారికి జవా న్లుగా పదోన్నతి కల్పించారు. ఇందులో 8 మంది డ్రైవర్లుగా పనిచేసినవారిని, నలుగు రు పారిశుధ్య కార్మికులకు అవకాశాన్ని కల్పించారు. ఇది సక్రమంగా జరగలేదని ఇటీవల మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ లు కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు.
గతంలో ఒక్కో డివిజన్‌కు పదిమం ది పారిశుధ్య కార్మికులు ఉండేవారు. 60 డివిజన్లకు 600 మంది పోనూ 400 మంది ప్రధాన రహదారులు, ఇతరచోట్ల పనిచేయించేవారు. డివిజన్ కు పదిమంది పారిశుధ్య కార్మికులలో ఒకరిని తమ ఇంటి వద్ద కార్పొరేటర్లు పనిలో ఉంచుకునేవారు. కొందరు స్వచ్ఛందంగా పదవీకాలం ముగిసి న అనంతరం పంపించగా, మరికొందరు తమ ఇళ్ల వద్దే పనికి ఉపయోగించుకుంటు న్నారు.
ఈ అంశం కమిషనర్ దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు. మాజీ కార్పొరేటర్ల ఇళ్ల వద్ద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను వెనక్కి పిలిపించి డివిజన్లలో నియమించా లని పలువురు కోరుతున్నారు. పలువురి వద్ద డ్రైవర్లు గా పని చేసిన వారు మున్సిపల్ కార్యాలయం లో అటెండెన్స్ ఇవ్వలేదు వీరు నేడు జవాన్ లు గా నియమితులై పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటార అన్నది అనుమానమే.
ఇదిలా ఉంటే కొత్తపల్లి మున్సిపాలిటీ తోపాటు ఐదు విలీన గ్రామాల్లో పారిశుధ్య సమస్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రస్తు తం ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికు లను నగరపాలక సంస్థ ఆధీనంలోకి తీసుకు ని అక్కడ పనులు మెరుగుపరచాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.






