16-01-2026 11:40:36 AM
భరత్ శాస్త్రి శివాని దంపతుల ను ఘనంగా సన్మానించిన చైర్మన్ అల్లంకి సత్యనారాయణ .....
సుల్తానాబాద్, (విజయక్రాంతి): రేపల్లెవాడ నోము నోముకోవడం ద్వారా కుటుంబాలకు పుణ్యఫలం దక్కుతుందని, ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత ఏర్పడుతుందని శ్రీ శివాలయం అర్చకులు వల్లకొండ మఠం రమేష్ అల్లుడు హైదరాబాద్ మరకత లింగ దేవాలయం నాగోల్ అర్చకులు పులికాంత మఠం భారత్ శాస్త్రి భక్తులకు వివరించారు.... భోగి , సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో అత్యంత వైభవంగా రేపల్లె వాడ నోము నిర్వహించడం జరిగినది, ఇందులో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని నోములతో ప్రత్యేక పూజలు చేశారు, ఈకార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ రేపల్లెవాడ రూపంగా పలు చెట్ల సముదాయాన్ని సమకూర్చినారు.
ఈ సందర్భంగా ఈ వ్రత మహత్యం గురించి పులికాంత మఠం భారత్ శాస్త్రి మాట్లాడుతూ రేపల్లె వ్రతం (దీనిని శ్రీ కృష్ణ వ్రతం అని కూడా అంటారు) దీన్ని ఆచరించడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిపారు, సంతాన ప్రాప్తి: సంతానం లేని దంపతులకు ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతాన యోగం కలుగుతుందని భక్తుల నమ్మకం.కుటుంబ సౌభాగ్యం: కుటుంబంలో శాంతి, అన్యోన్యత పెరుగుతాయి. కలహాలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు.కోరికల నెరవేర్పు: మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలు శ్రీకృష్ణుడి అనుగ్రహంతో నెరవేరుతాయి అని,ఆర్థికాభివృద్ధి: ఈ వ్రత ప్రభావం వల్ల దారిద్ర్యం తొలగి, సిరిసంపదలు కలుగుతాయని అన్నారు,మానసిక ప్రశాంతత, భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసుకి ప్రశాంతత కలుగుతుందని,పాప పరిహారం: తెలిసీ తెలియక చేసిన దోషాలు తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది అని తెలిపారు... అనంతరం ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భరత్ శాస్త్రి శివాని దంపతులను ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో అర్చకులు మల్ల కొండ మఠం మహేష్ తోపాటు భక్త బృందం పాల్గొన్నారు....