16-01-2026 12:49:44 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఫ్లూ అంటువ్యాధి సంక్రమణ, వైరస్ వల్ల కలుగుతుందని ఇది దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంద యశోద హాస్పిటల్ పాలమానాలాజిస్ట్ సాయి రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉండడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎప్పుడైనా ఫ్లూ సంక్రమించవచ్చునని కానీ సాధారణంగా శీతాకాలంలో ఎక్కువ సంభవిస్తుందన్నారు. 65 ఏళ్ల పైబడిన వారు 5 ఏళ్ల లోపు వయస్సు పిల్లలు ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఎక్కువ ఉందన్నారు. నిర్మల్లోని దేవేందర్ రెడ్డి హాస్పిటల్లో ప్రతి నెలలో మొదటి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామన్నారు. అవసరం ఉన్న వారు తమని సంప్రదించలన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్లు పాల్గొన్నారు.