2 July, 2026 | 2:34 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఘనంగా గ్రామం పుట్టినరోజు వేడుకలు

16-01-2026 11:37 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 

విజయక్రాంతి,పాపన్నపేట: మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతికి గ్రామస్తులు గ్రామం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా గ్రామానికి 78వ పుట్టినరోజు వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విచ్చేసి ముందుగా గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కోసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, లక్ష్మీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.