16-01-2026 12:10:30 PM
హైదరాబాద్: సంక్రాంతి(Sankranti) పండగ వేళ దొంగలు హల్ చల్ చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడిపల్లి పరిధిలో 12 ఇళ్లలో దొంగలు(Thieves) చోరీకి పాల్పడ్డారు. నవదుర్గ కాలనీ, అణుశక్తి నగర్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీ చేశారు. ఇళ్లలో బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. పండగకు బందువుల ఇళ్లకు వెళ్లిన వారు ఇంటికి వచ్చి చూసి షాకయ్యారు. బాధితుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండగకు ముందే పోలీసులు సొంతూళ్లకు వెళ్లే వారని అప్రమత్తం చేశారు.