16-01-2026 11:33:15 AM
అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి
తుంగతుర్తి( విజయ క్రాంతి): ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యగా ఉంటూ, ప్రజా సమస్యలపై విజయ క్రాంతి దినపత్రిక వాస్తవాలు ప్రచురిస్తుందని అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో విజయ క్రాంతి దినపత్రిక యాజమాన్యం పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన క్యాలెండర్2026 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలపై విజయ క్రాంతి దినపత్రిక ముందంజలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత, దొంగరి శ్రీనివాస్, కుంచాల వీరారెడ్డి, బింగి వెంకటేశ్వర్లు, మట్టపల్లి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.