16-01-2026 01:07:41 PM
వేములవాడలో మంత్రి సీతక్క, ఆదిశ్రీనివాస్ పర్యటన
హైదరాబాద్: వేములవాడలో మంత్రి సీతక్క(Minister Seethakka), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. కుటుంబసమేతంగా భీమేశ్వరస్వామిని సీతక్క, ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారని మంత్రి సీతక్క వెల్లడించారు. వేములవాడలో భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉందని తెలిపారు. ఆలయాల అభివృద్ధి.. భావోద్వేగాలు, ఆచారాలతో ముడిపడి ఉందని మంత్రి సీతక్క వివరించారు. ఈ నెల 19న మేడారం ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునః ప్రారంభిస్తారని పేర్కొన్నారు. జనవరి 18న మేడారంలో క్యాబినెట్ భేటీ జరుగుతుందన్నారు. పుష్కరాల దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు.