01-07-2025 06:01:37 PM
మహిళా ప్రేక్షకులు ఆనందపడే చిత్రం ‘తమ్ముడు’: సప్తమిగౌడ
“సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్‌హిట్ చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రత్న పాత్రలో నటిస్తున్న హీరోయిన్ సప్తమిగౌడ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
-కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు దగ్గర నుంచి ‘తమ్ముడు’ మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్టెస్ట్లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్‌గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. ఈ సినిమాకు పనిచేయడం మంచి అనుభవం వచ్చింది.
- అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి పాత్ర నాది. తను పవన్‌కళ్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్‌కు ఒక డిఫరెంట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. ‘కాంతార’తో చూస్తే లుక్వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉందనిపించవచ్చు. కానీ, క్యారెక్టర్‌గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. ‘తమ్ముడు’ కాస్త సీరియస్ సబ్జెక్ట్.. ఇందులో నా పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైందనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ ఉన్న పరిస్థితుల్లో తెలియకుండానే వారితో నా తరహాలో జోవియల్‌గా ఉంటాను. అది ఆడియెన్స్‌కు హ్యూమర్ ఇస్తుంది. రత్న రేడియో జాకీ కాదు. తను ఎలా ఉంటుందో సినిమా చూడాల్సిందే. కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.
పవన్‌కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు చెప్పారు. ఆ సినిమాతో పవన్ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో మనందరికీ తెలుసు. నేను కంప్లీట్ మూవీ చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ ‘తమ్ముడు’ సినిమా చూస్తా.
‘తమ్ముడు’ సినిమా.. నాకు తప్పకుండా నటిగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న పాత్ర రాసేటప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.
‘తమ్ముడు’లో నాతోపాటు లయ, దిత్య, వర్ష, స్వసిక.. ఇలా మా అందరి పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. మా ఐదు మహిళా పాత్రలు విభిన్నంగా, శక్తిమంతంగా ఉంటాయి. గుత్తి క్యారెక్టర్ చూస్తే బస్ డ్రైవ్ చేస్తుంది. తను బస్ డ్రైవింగ్ ఈ మూవీ కోసం నేర్చుకుంది. లయ స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. నేను, వర్ష.. ఇలా మా అందరికీ ఫైట్ సీక్వెన్సులుంటాయి. సినిమాల్లో హీరోతో సాంగ్స్ పాడే హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. కానీ ఇందులో ఫైట్ చేసే హీరోయిన్స్‌ను చూస్తారు. ఉమెన్ క్యారెక్టర్స్‌ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్లలో ‘తమ్ముడు’ సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు.
ఈ మూవీలో నితిన్‌తో నాకు లవ్‌ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణీతి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు ‘తమ్ముడు’ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్‌ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.
బిగ్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం ‘తమ్ముడు’ మూవీని చూడండి. మీరు ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చూస్తే సినిమా ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందో తెలుస్తుంది. ఇంట్లో ఇలాంటి సినిమా చూస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. థియేటర్లోనే ‘తమ్ముడు’ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
-నాకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమే. ‘తమ్ముడు’ కూడా కమర్షియల్ మూవీనే. ‘పుష్ప’లో రష్మిక చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ‘కాంతార’ సక్సెస్ తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నా. ఎక్కువ చిత్రాల్లో ప్రేక్షకులకు నేను కనిపించకపోవడానికి కారణమదే. డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతోపాటు తమిళంలో, కన్నడలో సినిమాలు చేస్తున్నా. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా. అన్ని భాషా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా.