01-07-2025 12:00:00 AM
రష్మిక మందన్న. ఇటీవల ‘కుబేర’తో ఈ ఏడాదిలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘వి ద ఉమెన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ధూమపానాన్ని తాను ఏమాత్రం ప్రోత్సహించనని స్పష్టం చేసింది. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను సైతం ఈ సందర్భంగా పంచుకుంది. “స్మోకింగ్‌ను నేను ఏమాత్రం ప్రోత్సహించను. అలాంటి సన్నివేశాల్లో నటించడం కూడా ఇష్టముండదు.
సినిమా వదులుకోవడానికైనా సిద్ధమే కానీ, అలాంటి సన్నివేశాల్లో నటించను. సినిమా చూసి ప్రభావితులవుతారనుకుంటే.. మీకు నచ్చినవే చూడండి. ప్రతి సినిమా చూడమని ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు. నటీనటులుగా మేం వివిధ పాత్రలను పోషిస్తున్నాం తప్ప, మా వ్యక్తిగత జీవితాలకూ.. స్క్రీన్‌పై మీరు చూసేదానికి ఎలాంటి సంబంధమూ లేదు” అని తెలిపింది.