18-08-2025 09:49:19 PM
వెల్దుర్తి,(విజయ క్రాంతి): భారీ వర్షపాతం పరిస్థితులపై జిల్లా కలెక్టర్ వెల్దుర్తి మండలం లో విస్తృత పర్యటన అధికారులకు కీలక సూచనలు జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షపాతం పరిస్థితిని వరదలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, వెల్దుర్తి మండలం వెల్దుర్తి ఉప్పిలింగాపూర్ రోడ్ లోని హల్దీపై ఉన్న బ్రిడ్జిని, కుక్కునూరు గ్రామ శివారులోని బ్రిడ్జిని పరిశీలించి ప్రజల అప్రమత్తతపై అధికారులకు పలు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుచర్యలు తీసుకుంటున్నామన్నారు . ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేసి , అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుతున్నామన్నార అధిక వర్షాలు పడి వాగులు చెరువులు ప్రాజెక్టులు పొంగి పొర్లి వరద ప్రవాహ ఉధృతి అధిక మొత్తంలో ఉందని జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దని, ఆకతాయిలు చెరువుల వద్ద ప్రాజెక్టు వద్ద సెల్ఫీలు మోజులో పడి చెరువుల్లో జారిపడి చనిపోయే ప్రమాదం ఉందని భద్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి తగు సూచనలు చేశారు.
వర్షానికి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించిన గ్రామాలు, కాలనీల్లో వెంటనే నీటిని తొలగించి శానిటేషన్ చర్యలు చేపట్టాలని డీపీఓను ఆదేశించారు. వర్షంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న చోట్ల వివరాలు సేకరించి తాత్కాలిక మరమ్మత్తులు వెంటనే చేయాలనీ, శాశ్వత పరిష్కారాల కోసం తగిన ఎస్టిమేట్లు పంపించాలని సూచించారు. నాళాలు, మురుగు కాలువలు శుభ్రపరచడం ద్వారా నీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులకు డ్యామ్‌లు, చెరువులు, వాగులు వద్ద నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ అవసరమైన నివేదికలను సమర్పించాలన్నారు. బ్యారేజీల వద్ద నీటిమట్టం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు కాజ్‌వేలు, వాగులు, నదుల వద్దకు వెళ్లకుండా ఉండేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖలు పరస్పర సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట SDRF బృందాలు రంగంలోకి దిగాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా , పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.