18-08-2025 09:58:53 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్,(విజయక్రాంతి): బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. సోమావారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని సెంటర్ లో చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన తెలిపారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.