18-08-2025 09:55:03 PM
మేడిపల్లి: ప్రతిష్టత్మకంగా ప్రారంభమైన బంజారా తీజ్ ఉత్సవాలు బోడుప్పల్,చెంగిచర్లలో 2వ డివిజన్ బస్ డిపో ప్రక్కన, 09 రోజులు ఘనంగా భక్తిశ్రద్దలతో శ్రీ శ్రీ మేరమా భవాని, సద్గరు సేవాలాల్ మహారాజ్ లకు తపస్సు చేసిన బంజారా బాలికలు. వారి కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. తీజ్ ప్రాముఖ్యత మనిషి జీవితం ఎలా అమ్మ కడుపులో పెరిగి భూమి మీద జన్మించి మరణం వరకు అమ్మాయిలకు మంచి భర్త రావాలని, పూర్వంలో పార్వతి దేవి హార్కలిక వ్రతం చేసి శివుడును పొందినట్లు తీజ్ ఎంత పచ్చగా వస్తే మన ఆయురారోగ్యాలు, వర్షాలు బాగా కురుస్తాయన్నారు.
భూమి మీద ఉన్న ప్రాణులు అందరికి మంచి జరుగుతుంది అని, ఇన్ని గుణాలు కల్గిన గోర్ బంజారా పండుగ తీజ్ పట్టణంలో తమ ఐక్యతను, ఉనికిని చాటుకుంటున్నారు బంజారా సంప్రదాయ పద్ధతిలో అట పాటలతో సంస్కృతిక కార్యక్రమలతో సందడి చేశారు. ముఖ్యంగా చెంగిచర్ల లో నిర్వహించినా బంజారా తీజ్ ఉత్సవాలు ఇతర కులాల వారు సైతం ఉత్సవాల్లో పాల్గొన్నాడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.