calender_icon.png 8 December, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి

08-12-2025 08:35:48 PM

కళ్ళు చెమ్మగిల్లే మేనిఫెస్టోని విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి

ఓటర్లను మభ్య పెట్టే దిశగా హామీలు

అంచనలను మించి పోయిన హామీలు

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలో ఉన్న పలు గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు హద్దులు దాటి ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఒక సర్పంచ్ తన పదవికాలంలో ఎన్ని నిదులైతే వస్తాయని తెలిసి కూడా, దానికి ఏడు రేట్లు ఎక్కువగా అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు, నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలకు నమ్మదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, మండలంలో అనంతసాగర్ గ్రామంలో తాజాగా ఓ సర్పంచ్ అభ్యర్థి అతని మేనిఫెస్టో విడుదల చేశారు.

అందులో దాదాపుగా 3 నుంచి 4 కోట్లకు పైగా ఖర్చయ్యే అభివృద్ధి పనులను చేయిస్తానంటున్న సర్పంచ్ అభ్యర్థి, మునుపెన్నడూ లేని విధంగా భారీ ఖర్చుతో అభివృద్ధి చేయడానికి కారణం ఏమిటి, ఆ ఊరి చివరికి ఉన్న కంపెనీల, లేక ఇంకేదైనా ఉందా? అని గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు గత ఎన్నికల్లో సిద్ధిరాములు ఇక్కడ సర్పంచ్ గా ఉన్నారు అతని పదవి కాలం మొత్తం ప్రభుత్వం నుండి గ్రామం అభివృద్ధి కొరకు కేవలం 60 లక్షలకు వరకు మాత్రమే వచ్చిందని అన్నారు, ఈ అభ్యర్థి మూడు, నుండి నాలుగు కోట్లు అభివృద్ధి పనులను ఎక్కడినుండి, తేగలడు, ఇలాంటి మాటలకు ఓటర్లు నమ్మి ఓటు వేయకూడదని చదువుకున్న యూవకులు మహేష్, శ్రీనివాస్ తెలిపారు, ఓటు అనేది ఒక ఆయుధం, అది ఆట బొమ్మ కాదు, అంగట్లో అమ్మే వస్తువు కాదని వారు అన్నారు.