calender_icon.png 28 November, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

28-11-2025 06:05:20 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామం పంచాయతీ ఆవరణలో మహాత్మ జ్యోతిబా పూలే గారి వర్ధంతి ని సాంఘిక సంక్షేమ యువకుడు కొల్చల్మే లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కోల్చెమే లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశంలోని మహనీయులను స్మరించుకోవడం, గౌరవించడం మన కర్తవ్యం అని తెలిపారు. నాటి రోజుల్లో వారు చేసిన పోరాటపటిమ వర్ణించదగినదని తెలిపారు. ఇందులో సెక్రెటరీ కల్పన, బి ఎల్లం, గ్రామంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.