calender_icon.png 28 November, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ పోటీలో యువత జోష్

28-11-2025 05:46:54 PM

నాగులపల్లిలో నామినేషన్ వేసిన రాములు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దెముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల్లో సర్పంచ్ పదవికి  పోటీ చేసినందుకు యువత అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పెద్దేముల్ మండలం నాగులపల్లి సర్పంచ్ పదవికి గ్రామానికి చెందిన పెద్ద కురువ రాములు అనే యువకుడు నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం యువతకు అవకాశం ఇవ్వాలని... గ్రామస్తులు, యువకులు, మహిళలు బలపరచడంతోనే తాను నామినేషన్ వేశానని గ్రామ పెద్దలు ఓటర్ మహాశయులు తనను ఆశీర్వదించాలని కోరాడు. గ్రామస్తులు సైతం డిగ్రీ విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యాదికుడైన రాములు సర్పంచ్ గా అందరికీ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాడని చర్చించుకుంటున్నారు.