28-11-2025 05:50:00 PM
తూప్రాన్,(విజయక్రాంతి): ఆదివారం జరగబోవు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తూప్రాన్ సిఐ రంగా కృష్ణ, ఎస్సై శివానందంతో కలిసి నామినేషన్ల కొరకు ఏర్పాటు చేసిన గదులను వారిదైన శైలిలో పరిశీలించడం జరిగింది. జరగబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రాంగణంలో కావలసిన బందు బస్తు ఏర్పాటుకు భారీకేట్ల వసతులను సిద్ధం చేయుటకు పరిశీలించడం జరిగింది. ఇందులో ఎంపీడీవో శాలిక తేలు, అధికారి శరత్, సంబంధిత ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.