6 April, 2026 | 10:07 PM

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ చేసిన సర్పంచ్ పగడాల రమాదేవి

06-04-2026 08:46 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట పంచాయితీ పరిధిలో గల పలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కమిటీ సభ్యుల సమక్షంలో సోమవారం బాలింతలకు, యుక్తవయసు బాలికలకు సర్పంచ్ పగడాల రమాదేవి, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు పౌష్టికాహారం పంపిణీ చేశారు. పిల్లల బరువులు నమోదు చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కమిటీ సభ్యులు మాట్లాడుతూ... అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా లబ్ధిదారులకు హాజరు తదనుగుణంగా పౌష్టికాహారం పంపిణీ జరగనున్నది.

ప్రతీ నెల 10వ తేదీ లోపు అంగన్వాడి కేంద్రంకి వచ్చి లబ్ధిదారులు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకోవాలని, గర్భిణులు, బాలింతలు, పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం పంపిణీ, ప్రీ స్కూల్‌ సమర్థంగా పని చేయడానికి ప్రభుత్వం స్థానిక కమిటీల పర్యవేక్షణ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, పసుమర్తి కుసుమాంబ, చిన్నశెట్టి నాగలక్ష్మి, కొత్తపేట ఎం.పి.పి.ఎస్ టీచర్, అంగన్వాడీ టీచర్లు పాశం శాంతి కుమారి, గోళ్ళ సీతారావమ్మ, బేగం తదితరులు పాల్గొన్నారు.