సర్పంచ్ ఆత్మహత్య
14-07-2026 12:00 AM
కుబీర్ జూలై 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తాండూరు మండలంలోని బోరిగం గ్రామానికి చెందిన సర్పంచ్ పల్లె జ్యోతి సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వివరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తానూర తెలిపారు. సర్పంచ్ ఆత్మహత్యతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.






