14 July, 2026 | 4:52 AM

మక్తాల పద్మావతి జలంధర్ గౌడ్‌కు సేవారత్న 2026 అవార్డు

14-07-2026 12:00 AM

16 సంవత్సరాల సేవకు గుర్తింపు..

సికింద్రాబాద్,జూలై13 (విజయ క్రాంతి): సామాజిక సేవ మరియు పర్యావరణ పరిరక్షణ రంగాల్లో 16 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నందుకు గాను మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల పద్మావతి జలంధర్ గౌడ్ కి సేవారత్న 2026 అవార్డు అందుకున్నారు. ఆదివారంసోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, భారీ జాతీయ పతాక ప్రదర్శన,చెట్లును నాటండి వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజాసేవలో జలంధర్ గౌడ్ చేస్తున్న కృషిని గుర్తించి ప్రముఖ సంస్థ ఆల్ ది బెస్ట్ ఆరట్స్ అకాడమీ ఈ పురస్కారాన్ని అందజేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెంటపాటి కృష్ణ ఆదిశేషు, ఆల్ ది బెస్ట్ ఆరట్స్ అకాడమీ చైర్మ న్ సూర్య నారాయణ అవార్డును అందజేశా రు. ఈ సందర్భంగా మక్తాల జలంధర్ గౌడ్ మాట్లాడుతూ ఈ అవార్డు నాకు ఒక్కడికే కాదు, గత 16 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తు న్న మక్తాల ఫౌండేషన్ వాలంటీర్లందరి కృషి కి దక్కిన గుర్తింపు అని అన్నారు.ఈ అవార్డు మొత్తం మక్తాల ఫౌండేషన్ టీమ్ కు గర్వ కారణమని, ఇంకా ఎక్కువ సేవ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు హరికుమార్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.