21-12-2025 11:02:27 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ పంచాయతీ పరిధిలోని బత్తుల నగర్ చెందిన ఇర్ప మౌనికకు రోడ్డు ప్రమాదానికి గురై భద్రాచలంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండంతో కృష్ణ సాగర్ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు ఆస్పత్రి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుుల నిమిత్తం రూ.5000 రూపాయలను అందజేశారు. వారితో పాటు గ్రామ పెద్దలు ఎస్కే అబ్దుల్లా, బాధావత్ లౌక్య ఉన్నారు.