calender_icon.png 21 December, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఏసీబీ సోదాలు

21-12-2025 10:22:00 AM

హైదరాబాద్: ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఖమ్మం ఆర్టీవోలో అధికారులు ఏజెంట్లు చేతులు కలిసి చేస్తున్న అక్రమ దందా చేస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో ఖమ్మం ఆర్టీవో ఆఫీస్ లో నిన్న మధ్యాహ్నం నుంచి సుమారు 20 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. 20 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి దస్త్రాలు, ఆర్సీలు, లైసెన్స్, రూ.78 వేలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రవాణాశాఖ అధికారుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.