calender_icon.png 21 December, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాడుదాం

21-12-2025 09:52:58 AM

బీసీ రిజర్వేషన్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): జనాభా లెక్కల శాతంలో బీసీలు ఎక్కువగా ఉండి పదవులు ఉద్యోగాలలో తక్కువ శాతం రిజర్వేషన్లు చూపించి రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాని రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రభుత్వపరంగా రావాల్సిన రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని బీసీ రిజర్వేషన్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇల్లందు పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికైన సందర్భంగా మొదటిసారి బీసీ రిజర్వేషన్స్ సాధన సమావేశం శనివారం ఇల్లందు పట్టణంలోని ఏక్తా హౌస్ నందు నిర్వహించారు.

మొదటగా బీసీ జేఏసీ నాయకులు, మడత వెంకట్ గౌడ్ అభిమానులు స్థానిక కరెంట్ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ మీదుగా ఏక్తా హౌస్ వరకు భారీ బైక్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల వృత్తిపరంగా వేరైనా రక్తం ఒకటేనని అన్నారు. అగ్రవర్ణ కులాల ఆధిపత్యంలో బీసీ కులాలు అణగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్ వద్దనే ఆగిపోతున్నారని అగ్రవర్ణ కులాలు రిజర్వేషన్లకు మించి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి వరకు ఆధిపత్య స్థాయి పదవులు అనుభవిస్తున్నారని అన్నారు.

ఓట్లు మనవి పదవులు అగ్రవర్ణాల వారీగా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మేమెంతో మా వాటా అంత అనే నినాదంతో బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఇల్లందు నుండే ఉదృతం చేస్తామని తమ ఉద్యమం అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇల్లందు నుండి మొదలైన అనేక పోరాటాలు ఆచరణలు విజయవంతం అయ్యాయని అదే స్ఫూర్తితో నేడు జరిగిన బిసి రిజర్వేషన్ యాక్షన్ కమిటీ సమావేశం పోరాట రూపకల్పన విజయవంతం అవుతుందని అన్నారు.

బీసీల ఐక్య సదస్సుకు హాజరైన ఎమ్మెల్యేకు ఘనస్వాగతం

బీసీ సంఘాల ఐక్య వేదిక సదస్సు హాజరైన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యకు బీసీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లందు ప్రాంతవాసి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులవ్వడం శుభ పరిమాణం అని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు.

ఇల్లందు ప్రాంతమంతా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా కలిసి జీవనం కొనసాగిస్తున్నారని ఈ ప్రాంతంలో అందరూ కుల మతాలకు అతీతంగా బందు వరుసలతో పిలుచుకుంటూ కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఈ జిల్లాలో తాము షెడ్యూల్ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ బీసీలకు చెందిన 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వ పక్షాన కొట్లాడుతామన్నారు. అనంతరం సదస్సుకు ముఖ్య అతిథులను చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ ను బీసీ జేఏసీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొని ప్రసంగించారు.