calender_icon.png 21 December, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా డీసీసీ అధ్యక్షులు

21-12-2025 09:55:36 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకం పేరులో నుండి గాంధీ మహాత్ముని పేరు తొలగించనున్నందున నేడు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొనడం జరుగుతుందని కావున మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు,కోఆర్డినేటర్ సభ్యులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఉదయం 11 గంటలకు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.