calender_icon.png 21 December, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం మనది

21-12-2025 09:50:00 AM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం మనదని జిల్లా పార్టీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన అనంతరం మొదటిసారి ఇల్లందుకు విచ్చేసిన దేవి ప్రసన్నను ఇల్లందు ఎమ్మెల్యే కోరరం కనకయ్య సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దేవి ప్రసన్న మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారనే దానికి నిదర్శనం నేటి సర్పంచ్ ఫలితాలే మంచి ఉదాహరణ అన్నారు.

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నాయకత్వంలో ఇల్లందు నియోజకవర్గంలోని 138 గ్రామ పంచాయతీలకు 101 గ్రామపంచాయతీలు విజయం సాధించడం సంతోషించదగిన విషయం అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు లక్షల కోట్ల రూపాయలు పథకాల రూపంలో అందిస్తున్నామని ప్రతి కార్యకర్త ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. దేశంలో పేద ప్రజలకు అండగా నిలవాలని ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం బిజెపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు.

ఏఐసిసి, పీసీసీ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలన నిర్మిస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, సర్పంచులు ధనసరి స్రవంతి, పాయం లలిత, భానోత్ శారద, పాయం స్వాతి, పూనెం స్వర్ణలత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.