21-12-2025 09:58:40 AM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బంజర తండ గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ పోతుల భూమయ్యా,వార్డ్ సభ్యులు ఎల్లారెడ్డి నియోజకవర్గము ఎమ్మెల్యే మదన్మోహన్రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... బంజారా తండా గ్రామపంచాయతీకి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. గ్రామ పాలకవర్గం ఐక్యమత్యంతో పనిచేసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలు అందజేయడంలో ఏవైనా పొరపాట్లు ఏర్పడితే కాంగ్రెస్ పార్టీపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముడేరే నరేష్, సీనియర్ నాయకులు లిబియా నాయక్, తదితరులు పాల్గొన్నారు.