calender_icon.png 10 January, 2026 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

09-01-2026 12:00:00 AM

అలంపూర్, జనవరి 8: వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్‌ఐ స్వాతి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  మానవపాడు స్టేజి జాతీయ రహదారి వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు.బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెంట్ తప్పనిసరిగా ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మైనర్లకు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.