calender_icon.png 12 January, 2026 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులు బాధ్యతగా పనిచేయాలి

12-01-2026 01:07:38 AM

తాడ్వాయి, జనవరి 11 (విజయ క్రాంతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతగా పని చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు గ్రామాలలో ప్రజలతో మమేకమై ఉంటూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.

గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని ఆయన సూచించారు. గతంలో గ్రామాలు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధించిందాన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. గ్రామాలలో ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారనే లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకువచ్చి  ప్రజలకు తాగునీటిని అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో సరైన వైకుంఠధామాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యం తో కేసిఆర్ వైకుంఠధామాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. పారిశుధ్యం కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి రెడ్డి, కపిల్ రెడ్డి, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.