12-01-2026 01:07:37 AM
కరింనగర్, జనవరి11 (విజయక్రాంతి): 26 వ డివిజన్ ఆదర్శనగర్ లో 20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరుకు రోడ్లు ఉన్న చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని దీని వల్ల రోడ్లు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటాయని అన్నారు.చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని ఉందని ఒక్కొక్కటి గా అన్ని రోడ్లు డ్రైనేజీలను మెరుగు పరచుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్,మాజీ కార్పోరేటర్ ఆర్ష మల్లేశం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,దండి రవీందర్,గీసా శ్రీనివాస్,మన్నె పద్మారావు,కొందటి లక్ష్మినారాయణ, మన్నె పద్మావతి,గీసా కాంతమ్మ,దినేష్,సిగిరి రవి,కుంభం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.