22 August, 2026 | 2:08 AM

ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి

22-08-2026 12:16 AM

మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మాజీ , ప్రస్తుత బార్ కౌన్సిల్ మెంబర్ కే సునీల్ గౌడ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి రత్నయ్య, జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్ యాదవ్, అండ్ వారి టీమ్ మెంబర్స్, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, బీ వైగిరి, అడ్వకేట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ రాజమల్లు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పొన్నం దేవరాజ్ గౌడ్, మహిళా, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఆయన స్ఫూర్తితో సమాజంలో మనకు చేతనైనంత బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వాలని ప్రతి ఒక్కరూ పిలుపు నిచ్చారు.17వ శతాబ్దంలోనే బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించడం ఎలాగో చూపించినటువంటి మార్గదర్శిగా ఆనాటి ప్రజలందరినీ కన్నబిడ్డల వలే పరిపాలించి వారి మన్ననలను పొంది సర్దార్ బిరుదును అంకితం చేసుకున్నటువంటి మహానుభావుడని కొనియాడారు