7 August, 2026 | 2:23 AM

సర్వాయి పాపన్న విడుదలకు సిద్ధం

07-08-2026 01:51 AM

సర్దార్ సర్వా యి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేశ్‌గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ ‘సర్దార్ సర్వాయి పాపన్న’. ఈ సినిమాను వీజీ మూ వీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్‌కే ఫిలింస్ ద్వారా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ పోస్టర్‌ను గురువారం లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

మా ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. దర్శక నిర్మాత వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. “ఈ నెల 7నే మా మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నాం. చిన్న సినిమాలకు థియేటర్స్ ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ నెల 14, లేదా 21న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మా సినిమాను సబ్బండ వర్గాలు ఆదరిస్తారని కోరుకుంటున్నాం” అని తెలిపారు.