7 August, 2026 | 2:28 AM

గుండెలను కదిలించే హుషారు పిట్టలు

07-08-2026 01:53 AM

అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భిక్షూ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న థియేటర్ల ద్వారా ఏషియన్ సురేశ్ ఫిలింస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అతిథిగా పాల్గొన్న బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాలకు మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ఈ సినిమా అందరికీ ఎంతో నచ్చుతుంది” అని తెలిపారు.

‘ఈ సినిమా విషయంలో మాకు ఇప్పటి వరకు అంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి’ అని హీరో అన్షు చెప్పారు. హీరోయిన్ వాసవి గణేశన్ మాట్లాడుతూ.. “హుషారు పిట్టలు’ కొన్నిచోట్ల కేకలు పట్టిస్తుంది. నవ్విస్తుంది. ప్రేక్షకుల మనసు కదిలిస్తుంది” అని తెలిపింది. “తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్ సినిమాల్లో ‘హుషారు పిట్టలు’ తప్పకుండా ఉంటుంది” అని దర్శకుడు భిక్షూ తెలిపారు.

నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. “మా సినిమా చూస్తే ప్రేక్షకుల డబ్బులకు తగిన ఫలితం ఉందని సంతృప్తి చెందుతారు” అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. “హుషారు పిట్టలు’ కమర్షియల్ సినిమా. ఈ చిత్రంతో నాకు కమర్షియల్ సక్సెస్ వస్తుందని నమ్ముతున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్, భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.